లేటెస్ట్ గా రిలీజ్ కి వచ్చిన సెన్సేషనల్ చిత్రాల్లో సాలిడ్ మల్టీస్టారర్ చిత్రం “వార్ 2” కూడా ఒకటి. దర్శకుడు అయాన్ ముఖర్జీ హీరోలు హృతిక్ రోషన్ అలాగే జూనియర్ ఎన్టీఆర్ కలయికలో చేసిన ఈ భారీ యాక్షన్ చిత్రం మంచి అంచనాలు నడుమ గ్రాండ్ గా విడుదల అయ్యింది. అయితే మొత్తం ఇండియా వైడ్ గా వార్ 2 కి మంచి ఓపెనింగ్స్ దక్కినట్టుగా పి ఆర్ లెక్కలు చెబుతున్నాయి.
తెలుగు, హిందీ భాషల్లో సాలిడ్ ఓపెనింగ్స్ ని అందుకున్న ఈ చిత్రం తమిళ్ లో కొంచెం తక్కువే రాబట్టినట్టు తెలుస్తుంది. ఇలా మొదటి రోజు ఇండియా వైడ్ గా 50 కోట్లకి పైగా గ్రాస్ ని (ఆఫ్ లైన్ కాకుండా) అందుకున్నట్టుగా ఇప్పుడు తెలుస్తుంది. ఈ లెక్కన ఓవర్సీస్ వసూళ్లతో కలిపి ఈ లెక్క మరింత ఉండొచ్చని చెప్పవచ్చు. మొత్తానికి మాత్రం వార్ 2 ఓ భారీ ఓపెనింగ్ నే అందుకుంది. ఇక డే 2 కూడా పికప్ అవుతుండగా ఈ రెండో రోజు ఎలా ఉంటుందో చూడాలి.