ప్రస్తుతం రాబోతున్న పలు అవైటెడ్ పాన్ ఇండియా చిత్రాల్లో బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ అలాగే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ల కలయికలో దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన భారీ యాక్షన్ చిత్రం “వార్ 2” కూడా ఒకటి. మరి ఈ సినిమాలో అవైటెడ్ సాంగ్ హృతిక్ వర్సెస్, ఎన్టీఆర్ నడుమ సాంగ్ కోసం ఎంతోమంది వెయిట్ చేశారు. మరి ఈ సాంగ్ తాలూకా ప్రోమో మేకర్స్ ఎట్టకేలకి వదిలారు.
ఇక ఈ సాంగ్ లో మాత్రం ఇద్దరు హీరోలు మంచి స్మూత్ మూమెంట్స్ తో ఆకట్టుకున్నారని చెప్పాలి. స్టైలిష్ లుక్స్ లో మంచి గ్రేస్ తో చేసిన డాన్స్ మూమెంట్స్ బాగున్నాయి. ఇక సాంగ్ కూడా తెలుగు వెర్షన్ లో బాగుంది. మరి ఈ సాంగ్ ని మొత్తం థియేటర్స్ లోనే చూడాలని మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. ఇక ఈ చిత్రానికి ప్రీతమ్ సంగీతం అందించగా యష్ రాజ్ ఫిల్మ్స్ వారు నిర్మాణం వహించారు.