యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య నటించిన లేటెస్ట్ మూవీ ‘తండేల్’ రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమా ట్రైలర్‌ను తాజాగా రిలీజ్ చేశారు మేకర్స్. తండేల్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను వైజాగ్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా నాగచైతన్య ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వైజాగ్ అంటే తనకు చాలా ఇష్టమని.. ఎంతంటే.. తాను వైజాగ్ అమ్మాయిని ప్రేమించి పెళ్లి కూడా చేసుకున్నానని.. ఇప్పుడు వైజాగ్ తన ఇంట్లో కూడా ఉందని.. తన ఇంట్లో రూలింగ్ పార్టీ వైజాగ్ యే అని.. నాగచైతన్య కామెంట్ చేశాడు. తన భార్య శోభిత ధూళిపాళకు సంబంధించి చైతూ ఇలా కామెంట్ చేశారని అభిమానులు అంటున్నారు. ఇక తండేల్ చిత్రం కోసం తామందరం తీవ్రంగా కష్టపడ్డామని చైతూ చెప్పుకొచ్చాడు.
ఈ సినిమాలో చైతూ పాత్ర ప్రేక్షకులను మెస్మరైజ్ చేసే విధంగా తీర్చిదిద్దారు. ఇక ఈ సినిమాలో అందాల భామ సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను బన్నీ వాస్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.