‘మెగాస్టార్’ పై ఫ్లాష్ బ్యాక్.. వెంకీ రోల్ కూడా ?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ఓ ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ రాబోతుంది. ఐతే, ఇప్పుడు ఈ సినిమా పై మరో క్రేజీ గాసిప్ వినిపిస్తోంది. ఈ సినిమా సెకండ్ హాఫ్ లో ఫుల్ యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు ఫుల్ ఎమోషనల్ సీక్వెన్సెస్ ఉంటాయని.. అందుకు తగ్గట్టు.. సెకండ్ హాఫ్ లో మెగాస్టార్ చిరంజీవి పాత్ర పై ఓ ఫ్లాష్ బ్యాక్ ను ప్లాన్ చేశారని తెలుస్తోంది. ఈ ఫ్లాష్ బ్యాక్ లో మెగాస్టార్ పాత్ర మాఫియా నేపథ్యంలో ఉంటుందని తెలుస్తోంది. ఈ ఫ్లాష్ బ్యాక్ లోనే విక్టరీ వెంకటేష్ కూడా కనిపిస్తారట.

కాగా ఈ సినిమా గురించి మెగాస్టార్ ఆ మధ్య మాట్లాడుతూ.. ‘ఈ సినిమా పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రమని.. ఈ మూవీ కథ తనకు నచ్చిందని చిరు ఆల్ రెడీ చెప్పారు. అన్నట్టు, అనిల్ రావిపూడి చెప్పే సీన్స్ గురించి కూడా మెగాస్టార్ చెబుతూ.. ‘సినిమాలో ఆయా సన్నివేశాల గురించి అనిల్‌ రావిపూడి నాకు చెబుతుంటే కడుపుబ్బా నవ్వుతున్నాను. ఈ సినిమా కచ్చితంగా అభిమానులకు నచ్చుతుంది’ అని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. ఇక సాహు గారపాటి, సుస్మిత (చిరంజీవి కుమార్తె) సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తారని చిరు తెలిపారు.

Exit mobile version