డే 2 అజిత్ సినిమాని మించి ధనుష్ సినిమా!

తమిళ స్టార్ హీరోస్ థలా అజిత్ కుమార్ అలాగే ధనుష్ ల నుంచి ఈ ఏడాది పలు సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే వీటిలో అజిత్ కెరీర్లో భారీ హిట్ అయ్యిన గుడ్ బ్యాడ్ అగ్లీ తమిళ నాట సాలిడ్ వసూళ్లు అందుకుంది. అయితే ధనుష్ నుంచి సాలిడ్ హిట్ “కుబేర” ఇప్పుడు వచ్చింది.

అయితే గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా తమిళ నాట భారీ వసూళ్లు అందుకుంటే కుబేర తెలుగు వెర్షన్ లో అదరగొడుతుండడం గమనార్హం మరి ఈ రెండు సినిమాల్లో కుబేర డే 2 సాలిడ్ బుకింగ్స్ ఈ చిత్రం అందుకుంది. అజిత్ లాంటి స్టార్ హీరో డే 2 బుకింగ్స్ ని కుబేర అందుకుంది.

అజిత్ సినిమా 3 లక్షల 5 వేల టికెట్స్ బుక్ మై షోలో అమ్ముడుపోగా కుబేర మాత్రం 3 లక్షల 39 వేలకి పైగా టికెట్స్ ని సేల్ చేసుకొని అదరగొట్టింది. మరి అజిత్ లాంటి స్టార్ హీరో సినిమాని ధనుష్ డామినేట్ చేయడం అనేది కంప్లీట్ గా శేఖర్ కమ్ముల కంటెంట్ పవర్ అని చెప్పొచ్చు.

Exit mobile version