కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా రష్మిక మందన్నా ఫీమేల్ లీడ్ లో దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన అవైటెడ్ చిత్రమే ‘కుబేర’. కింగ్ నాగార్జున కూడా సాలిడ్ పాత్రలో నటించారు. మరి ఈ సినిమా సాలిడ్ హిట్ అయ్యి భారీ వసూళ్లు సొంతం చేసుకుంటుంది. దీనితో మేకర్స్ సక్సెస్ మీట్ ని నేడు గ్రాండ్ గా నిర్వహించారు.
మరి ఈ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా వచ్చారు. మరి ఇక్కడ అక్కినేని నాగార్జున, మెగాస్టార్ పక్కపక్కనే కూర్చోగా ఇద్దరిపై ఒక మెగా – నాగ్ ఫ్రేమ్ పిక్ ఆఫ్ ది డే గా నిలిచింది. దీనితో ఈ పిక్ మెగా మరియు అక్కినేని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ చిత్రంకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, అమిగోస్ క్రియేషన్స్ వారు నిర్మాణం వహించారు.