ఎట్టకేలకు తమిళనాడు ధియేటర్ యాజమాన్యం కమల్ హసన్ నిర్ణయం మీద విజయం సాదించినట్టు తెలుస్తుంది. గత నెల పాటు “విశ్వరూపం” చిత్రం ఒకరోజు ముందే డి.టి.హెచ్ లో ప్రదర్శించాలన్న నిర్ణయం కమల్ హసన్ మరియు ధియేటర్ యాజమాన్యం మధ్య వివాదానికి దారి తీసింది. కమల్ హసన్ కి పలు బెదిరింపు కాల్స్ వచ్చాయని పోలీస్ కంప్లైంట్ కూడా చేశారు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర డి.టి.హెచ్ ప్రదర్శనను కమల్ హాసన్ నిలిపి వేస్తున్నట్టు తెలుస్తుంది. చిత్రం విడుదల అయిన ఐదు వారాల తర్వాత చిత్రాన్ని DTH లో ప్రదర్శించవచ్చు అన్న ప్రతిపాదనకు కమల్ అంగీకరించినట్టు తెలుస్తుంది. జనవరి 25న ధియేటర్లలో మాత్రమే ఈ చిత్రం విడుదల కానుంది. కమల్ హాసన్ రచించి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రంలో పూజ కుమార్ మరియు ఆండ్రియా ప్రధాన పాత్రలు పోషించారు.