నవంబర్ 7న రానున్న విశ్వరూపం ఆడియో

నవంబర్ 7న రానున్న విశ్వరూపం ఆడియో

Published on Oct 15, 2012 7:50 PM IST


కమల్ హాసన్ రాబోతున్న చిత్రం “విశ్వరూపం” నవంబర్ 7న జరుపుకోనుంది అని విశ్వసనీయ వర్గాల సమాచారం. అదే రోజున కమల్ హాసన్ పుట్టిన రోజు కావడం ఈ కార్యక్రమానికి మరింత ప్రాధాన్యం తెచ్చి పెట్టింది.ఒకే రోజులో కమల్ హాసన్ ఒక ప్రత్యేక విమానంలో తమిళనాడులోని మూడు విభిన్న పట్టణాలలో ఈ ఆడియోని విడుదల చేయ్యనున్నట్టు సమాచారం. కమల్ హాసన్, పూజ కుమార్, ఆండ్రియా, రాహుల్ బోస్ మరియు శేఖర్ కపూర్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ యాక్షన్ చిత్రాన్ని కమల్ హాసన్ రచించి దర్శకత్వం చెయ్యడమే కాకుండా నిర్మాణంలో సహకారం అందించారు. ప్రసాద్ వి పొట్లూరి మరొక సహా నిర్మాత. శంకర్-ఎహాసన్-లాయ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.తీవ్ర వాద శక్తుల గురించి ఈ చిత్రం ఉండబోతుంది.

తాజా వార్తలు