కమల్ హసన్ రాబోయే చిత్రం “విశ్వరూపం” సమస్యల వలయం నుండి బయటపడినట్టు కనిపించడం లేదు. దాదాపుగా ఒక నెల పాటు DTH ప్రీమియర్ గురించి థియేటర్ యాజమాన్యంతో పోరాడారు చివరికి ఇద్దరి ఒప్పందం మీద ఈ చిత్రాన్ని జనవరి 25న తెలుగు మరియు తమిళంలో విడుదల చేస్తున్నారు. DTH ప్రీమియర్స్ ఫిబ్రవరి 2న ప్రదర్శించనున్నారు. కాని ప్రస్తుతం ఈ చిత్రం మరో నూతన సమస్యను ఎదుర్కుంటుంది. ఈ చిత్రం మీద ముస్లిం వర్గాలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
ఈరోజు తమిళనాడులో ముస్లిం వర్గాల నాయకులు ఈ చిత్రం మతాల మధ్యన ఉన్న సమతుల్యతను దెబ్బతీసేలా ఉంది అని అన్నారు. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా బాన్ చెయ్యాలని కోరారు. దీని గురించి కమల్ స్పందించలేదు. ప్రస్తుతం అయన ఫ్రేమొంట్,కాలిఫోర్నియా లో 25న జరగనున్న ప్రీమియర్స్ కి సిద్దం అవుతున్నారు. ఈ చిత్రాన్ని రచించి స్వీయదర్శకత్వంలో కమల్ హాసన్ నిర్మించారు. అంతేకాకుండా ఈ చిత్రంలో ప్రధాన పాత్ర కూడా పోషించారు. ఆయనతో పాటుగా పూజ కుమార్, ఆండ్రియా, శేఖర్ కపూర్ మరియు రాహుల్ బోస్ నటించారు