వాయిదా పడ్డ కమల్ హాసన్ విశ్వరూపం

వాయిదా పడ్డ కమల్ హాసన్ విశ్వరూపం

Published on Dec 15, 2012 9:12 AM IST

viswaroopam
కమల్ హాసన్ రాబోతున్న అద్బుతం “విశ్వరూపం” ఆంధ్ర ప్రదేశ్ లో సంక్రాంతి రేస్ నుండి తప్పుకుంది. కమల్ హాసన్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రంలో అయన ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రం తెలుగు,తమిళం మరియు హిందీలలో జనవరి 11న విడుదల గతంలో ప్రకటించారు కాని ప్రస్తుతం హిందీ మరియు తమిళంలో మాత్రమే విడుదల అవుతుంది. తెలుగులో సంక్రాంతికి ” నాయక్”, “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” విడుదల అవుతుండటంతో కమల్ హాసన్ చిత్ర విడుదలను వాయిదా వెయ్యాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. ఈ చిత్ర హిందీ వెర్షన్ హక్కులను ఏక్తా కపూర్ సొంతం చేసుకున్నారు. కమల్ హాసన్ ,పూజ కుమార్,ఆండ్రియా మరియు రాహుల్ బోస్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. శంకర్- ఎహాసన్ -లే త్రయం ఈ చిత్రానికి సంగీతం అందించారు.

తాజా వార్తలు