‘విశ్వంభర’ రిలీజ్ డేట్‌పై మరో ఆసక్తికర వార్త.. ఈసారైనా ఫిక్స్ అయ్యేనా..?

‘విశ్వంభర’ రిలీజ్ డేట్‌పై మరో ఆసక్తికర వార్త.. ఈసారైనా ఫిక్స్ అయ్యేనా..?

Published on Jul 5, 2025 11:00 PM IST

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ది మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘విశ్వంభర’ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా మేకింగ్ విషయంలో అనుకున్న దానికంటే ఎక్కువ సమయం పడుతుండటంతో ఈ సినిమాపై అభిమానులు తీవ్ర నిరాశగా ఉన్నారు. ఇక ఈ సినిమాను దర్శకుడు వశిష్ట మల్లిడి పూర్తి సోషియో ఫాంటసీ చిత్రంగా అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నాడు. కాగా, ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో ఇంకా క్లారిటీ రాకపోవడంతో అభిమానులు ఈ చిత్రం కోసం ఆతృతగా చూస్తున్నారు.

అయితే, ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ విషయంలో మేకర్స్ ఓ నిర్ణయానికి వచ్చినట్లు సినీ సర్కిల్స్ టాక్. ఈ సినిమాను సెప్టెంబర్ 18న దసరా బరిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఓజి’ సెప్టెంబర్ 25న రిలీజ్ అవుతుండటంతో తమకు వారం రోజుల సమయం దొరుకుతుందని మేకర్స్ భావిస్తున్నారట. దీంతో మేకర్స్ ఈసారి సెప్టెంబర్ 18న విశ్వంభర చిత్రాన్ని రిలీజ్ చేయాలని పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది.

మరి ఈసారైనా విశ్వంభర చిత్రాన్ని అనుకున్న డేట్‌కు రిలీజ్ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో అందాల భామ త్రిష హీరోయిన్‌గా నటిస్తుండగా ఎం.ఎం.కీరవాణి ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. యూవి క్రియేషన్స్ బ్యానర్ ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు