పిక్ టాక్ : అమెరికాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గ్రాండ్ ఎంట్రీ..!

పిక్ టాక్ : అమెరికాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గ్రాండ్ ఎంట్రీ..!

Published on Jul 5, 2025 8:00 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’, ‘పుష్ప-2’ సినిమాలతో తెచ్చుకున్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. బన్నీ పుష్పరాజ్ మార్క్ యావత్ ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. ఇక అల్లు అర్జున్ ఫాలోయింగ్ ఈస్ట్ నుంచి వెస్ట్ వరకు పాకింది. ప్రస్తుతం అల్లు అర్జున్ చేయబోయే ప్రాజెక్ట్ పాన్ వరల్డ్ మూవీగా రానుండటంతో ఈ సినిమా కోసం అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక తాజాగా అల్లు అర్జున్ అమెరికాలో జరుగుతున్న తెలుగు సంబరాలు 2025 వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్లాడు.

ఫ్లోరిడాలోని టంపాలో అల్లు అర్జున్‌కు అక్కడి అభిమానులు గ్రాండ్ వెల్కమ్ ఇచ్చారు. బన్నీని చూసేందుకు అభిమానులు ఎయిర్‌పోర్ట్ వద్ద భారీగా హాజరయ్యారు. అల్లు అర్జున్‌కు పూలదండలతో, బొకేలతో స్వాగతం పలికారు. ఇక అమెరికా తెలుగు సంబరాలు 2025లో ముఖ్య అతిథిగా అల్లు అర్జున్ అక్కడున్న తెలుగు వారిని పలకరించనున్నాడు. మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకలో పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు పాల్గొంటారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు