తమ్ముడు డేట్‌పై కన్నేసిన విశ్వంభర..?

టాలీవుడ్‌లో ప్రస్తుతం చాలా సినిమాలు రిలీజ్ డేట్ వాయిదా వేసుకుని రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి. ఇందులో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర కూడా ఒకటి. ఈ ప్రెస్టీజియస్ సోషియో ఫాంటసీ చిత్రాన్ని దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తుండగా విజువల్ ట్రీట్‌గా ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్దమవుతోంది.

అయితే, ఈ సినిమాను గతంలోనే రిలీజ్ చేస్తామని చెప్పిన మేకర్స్, కొన్ని కారణాల వల్ల రిలీజ్ డేట్ వాయిదా వేస్తూ వచ్చారు. కాగా ఇప్పుడు ఈ చిత్ర రిలీజ్ డేట్‌పై వారు ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. జూలై 4న ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. అయితే, అదే రోజున మరో హీరో సినిమా కూడా రిలీజ్ కానుంది.

హీరో నితిన్ నటిస్తున్న ‘తమ్ముడు’ చిత్రం జూలై 4న రిలీజ్‌కు రానున్నట్లు ఇప్పటికే వెల్లడించారు. దీంతో మెగాస్టార్ విశ్వంభర గనుక జూలై 4న రిలీజ్ అయితే, తమ్ముడు పరిస్థితి ఏమిటని సినీ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది. మరి నిజంగానే తమ్ముడు డేట్‌పై అన్నయ్య ఫిక్స్ అవుతాడా.. లేక వేరొక డేట్ చూసుకుంటాడా అనేది వేచి చూడాలి.

Exit mobile version