ఎమోషనల్ వీడియో: నాన్న మెగాస్టార్ బర్త్ డే సెలబ్రేట్ చేసిన గ్లోబల్ స్టార్

తెలుగు సినిమా దిగ్గజ తార మెగాస్టార్ చిరంజీవి 70వ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు ఈ ప్రత్యేక రోజుని ఇంకా ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాల్లో జరుపుకుంటూ ఉండగా మెగాస్టార్ చిరంజీవి తనయుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ షేర్ చేసుకున్న ఎమోషనల్ వీడియో ఒకటి వైరల్ గా మారింది.

మెగాస్టార్ పుట్టినరోజుని కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకోవడం ఇందులో మెగాస్టార్ ని ఆప్యాయంగా ఆలింగనం చేసుకోవడం హత్తుకోవడం వంటివి చూస్తుంటే అభిమానులకు మరింత ఎమోషనల్ గా అనిపిస్తున్నాయి. అలాగే ఈ వీడియో విజువల్స్ లోనే చరణ్, చిరంజీవిల నడుమ ఎమోషనల్ బంధం ఏపాటిది అనేది కూడా క్లియర్ గా కనిపిస్తుంది. దీనితో ఈ బ్యూటిఫుల్ అండ్ ఎమోషనల్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో మెగా అభిమానుల్లో వైరల్ గా మారిపోయింది.

Exit mobile version