మన టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఎన్నో సినిమాల్లో సాలిడ్ ట్రాక్ రికార్డు ఉన్న జానర్స్ లో ఫాంటసీ జానర్ కూడా ఒకటి. ఒక అంజి, జగదేక వీరుడు అతిలోక సుందరి లాంటి సినిమాలకి తెలుగు ఆడియెన్స్ లో ప్రత్యేక స్థానం ఉంది. అయితే ఆ సినిమాల తరహాలోనే విశ్వంభర కూడా అదిరిపోద్ది అనే ప్రామిస్ ని దర్శకుడు చేస్తున్నాడు.
తనకి విశ్వంభర సినిమా చేసేందుకు ప్రేరణగా ఏఎన్నార్ కీలుగుర్రం అని చెబుతున్నాడు. అలాగే ఈ సినిమా లైన్ ని కూడా తాను చెప్పడం మరింత ఎగ్జైట్ అవుతుంది. హీరోయిన్ కోసం హీరో పద్నాలుగు లోకాలు దాటి ఎలా తీసుకొచ్చాడు అనేదే కథ అంటూ తెలిపాడు.
దీనితో మళ్ళీ మెగాస్టార్ ఫ్యాన్స్ కి ఎలాంటి ఫాంటసీ అడ్వెంచర్ ని ఆశిస్తున్నారో ఆ రేంజ్ ట్రీట్ ని విశ్వంభర ఇవ్వడం గ్యారెంటీ అనిపిస్తుంది. విజువల్స్, కథనం పర్ఫెక్ట్ గా కుదిరాయి అంటే తెలుగు స్టేట్స్ లో మళ్ళీ మెగాస్టార్ సినిమా సత్తా ఏంటో తెలుస్తుంది అని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా యూవీ క్రియేషన్స్ వారు నిర్మాణం వహిస్తుండగా ఈ ఏడాదిలోనే సినిమా రిలీజ్ కి తీసుకొస్తున్నారు.