బాలయ్య బాబు ప్రస్తుతం వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ వంటి చిత్రాలతో వరుస హిట్లు అందుకుని ఫుల్ ఫామ్ లో ఉన్నారు. ప్రస్తుతం బోయపాటి శ్రీనుతో ‘అఖండ-2’ సినిమా చేస్తున్నాడు. అలాగే, గోపీచంద్ మలినేని, బాలయ్యతో మరో మూవీ చేస్తున్నాడు. ఇప్పటికే, గోపీచంద్ మలినేని ఈ చిత్రానికి సంబంధించిన షెడ్యూల్స్ ను లాక్ చేశారు. ఈ సినిమా కీలక షెడ్యూల్ ను హైదరాబాద్‌లో ప్రారంభించనున్నారు. ఈ షెడ్యూల్ లో బాలయ్య పై ఇంట్రో సన్నివేశాలను ఘాట్ చేస్తారట. అన్నట్టు ఈ సినిమాలోని కీలక పాత్రల కోసం ఓ తమిళ హీరోని తీసుకొవాలని చూస్తున్నారు.
కాగా వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీశ్ కిలారు దీనిని నిర్మించనున్నారు. ఈ సినిమా గురించి గోపీచంద్ మలినేని ఎక్స్ వేదికగా ఆ మధ్య స్పందిస్తూ.. ‘‘గాడ్ ఆఫ్ మాసెస్ ఈజ్ బ్యాక్.. ఈసారి మా గర్జన మరింత గట్టిగా ఉండనుంది. బాలకృష్ణతో కలిసి మరోసారి వర్క్ చేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఇది చరిత్రలో నిలిచిపోయే చిత్రం కానుంది’’ అని తన పోస్ట్ లో పేర్కొన్నారు. నందమూరి బాలకృష్ణ నటించనున్న 111 ప్రాజెక్ట్ ఇది.