ముంబైలో ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీ పాఠశాలను సందర్శించిన బాలకృష్ణ

ముంబై పర్యటనలో భాగంగా సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వాడాలాలోని ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీ స్కూల్‌ను సందర్శించారు. 77 ఏళ్లుగా తెలుగు సమాజానికి సేవలందిస్తున్న ఈ పాఠశాలలో 4,000 మంది విద్యార్థులు చదువుతున్నారు.

విద్యార్థులతో ముచ్చటించిన బాలకృష్ణ, వారికి ప్రోత్సాహకరమైన సందేశాలు అందించారు. ఆయన రాకతో పాఠశాలలో సందడి వాతావరణం నెలకొంది. బాలయ్యతో విద్యార్ధులు చాలా సేపు ముచ్చటించారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యక్షుడు రామ్మోహన్ బండ్లమూడి, జనరల్ సెక్రటరీ కృష్ణప్రసాద్ కూడా పాల్గొన్నారు. బాలకృష్ణ అందించిన ప్రోత్సాహం విద్యార్థుల్లో సరికొత్త ఉత్తేజాన్ని నింపుతుందని పాఠశాల యాజమాన్యం తెలిపింది.

Exit mobile version