‘అఖండ 2’ ఓటీటీ డీల్.. మరో కొత్త ట్విస్ట్..!

Akhanda2

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ది మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ చిత్రం ‘అఖండ 2’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దర్శకుడు బోయపాటి శ్రీను ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నాడు. ఇక గతంలో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన ‘అఖండ’ చిత్రానికి సీక్వెల్‌గా ఈ మూవీ వస్తుండటంతో అఖండ 2 పై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి.

అయితే, ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ డీల్ క్లోజ్ అయిందని గతంలోనే వార్తలు వినిపించాయి. కానీ, టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్ర ఓటీటీ డీల్ తాజాగా క్లోజ్ అయినట్లు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ నెట్‌ఫ్లిక్స్ ఈ చిత్రానికి ఉన్న క్రేజ్ దృష్టిలో పెట్టుకుని ఫ్యాన్సీ రేటుకు ఈ చిత్ర ఓటీటీ రైట్స్ దక్కించుకుందట.

ఇప్పటివరకు కేవలం నలుగురు పాన్ ఇండియా స్టార్స్‌కు మాత్రమే ఇచ్చే ఆఫర్‌ను నెట్‌ఫ్లిక్స్ ఇప్పుడు బాలయ్య సినిమాకు ఇవ్వడం విశేషంగా మారినట్లు తెలుస్తోంది. ‘డాకు మహారాజ్’ చిత్ర సక్సెస్‌ను కూడా పరిగణించాక ఈ మేరకు డీల్ క్లోజ్ చేసినట్లు తెలుస్తోంది. మొత్తానికి థియేటర్లలో మాత్రమే కాకుండా ఓటీటీలోనూ అఖండ 2 తాండవం చేయనుంది. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్‌ను సెప్టెంబర్ 25 నుంచి వాయిదా వేసిన సంగతి తెలిసిందే.

Exit mobile version