మరో ఇంట్రస్టింగ్ టైటిల్ తో ‘విశ్వక్ సేన్’ !

“ఫలక్ నమా దాస్”తో పాటు ‘హిట్’తో క్రేజీ సక్సెస్ ను సొంతం చేసుకున్న హీరో విశ్వక్ సేన్ హీరోగా, బెక్కెం వేణుగోపాల్ నిర్మాణంలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. కాగా క్రేజీ లవ్ స్టోరీగా రాబోతున్న ఈ సినిమాకి “పాగల్” అనే టైటిల్ ను ఫిక్స్ చేసిందట చిత్రబృందం. ఇదే టైటిల్ ను పెట్టబోతున్నట్లు గతంలోనే వార్తలు వచ్చాయి. త్వరలోనే చిత్రబృందం కూడా ఈ టైటిల్ ను అధికారికంగా ప్రకటించనుంది.

కాగా ఈ మూవీతో నరేష్ రెడ్డి కుప్పిలి అనే యంగ్ డైరెక్టర్ ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు. క్రేజీ లవ్ స్టొరీగా తెరకెక్కనున్న ఈ మూవీ షూటింగ్ ఏప్రిల్ రెండో వారాం నుండి మొదలుకానుంది. ఇక “ఫలక్ నమా దాస్” మరియు ‘హిట్’ లాంటి సూపర్ హిట్స్ తో యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించిన హీరో విశ్వక్ సేన్ తో లక్కీ మీడియా బ్యానర్ నెక్ట్ ప్రాజెక్ట్ చేయడంతో ఈ సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి.

Exit mobile version