స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాల గత కొన్నాళ్లుగా తమిళ యాక్టర్ విష్ణు విశాల్ తో డేటింగ్ లో ఉంది. అయితే నేడు జ్వాల పుట్టినరోజు. తన పుట్టినరోజు వేడుక సందర్భంగా గుత్తా జ్వాల – విష్ణు విశాల్ జంట నిశ్చితార్థం చేసుకుంది. ఇంకా పెళ్లి తేదీని ఇంకా ప్రకటించలేదు. ఇక ఆ మధ్య ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో జ్వాల, విష్ణు విశాల్‌తో తన సంబంధం పెళ్లి గురించి మాట్లాడుతూ.. ‘మేము వివాహం చేసుకోబోతున్నామని.. తగిన సమయం చూసుకుని త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నామని ఆమె తెలిపారు. మరి ఇప్పుడు సైలెంట్ గా నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట మరి పెళ్లి ఎప్పుడు చేసుకుంటుందో చూడాలి.
ఇక గతంలో జ్వాల బ్యాడ్మింటన్ క్రీడాకారుడు చేతన్ ఆనంద్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ ఆ బంధం కొద్దికాలానికి పరిమితం అయిందనుకోండి. ఇటు హీరో విష్ణు విశాల్ కూడా రజనీ అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. కానీ వీళ్లు కూడా విడిపోయారు. మొత్తానికి ఇద్దరూ తమ భాగస్వామ్యులను వదిలి.. ఒక్కటయ్యారు. మొత్తానికి గుత్తా జ్వాల, విష్ణు విశాల్ తో కాబోయే పెళ్లిని బహిరంగం చేసేసింది,