ఆ ట్విట్టర్ ఐడి నాది కాదన్న మంచు విష్ణు

vishnu
గతంలో మంచు విష్ణు ట్విట్టర్ లో బాగా యాక్టివ్ గా ఉండేవాడు. కానీ విష్ణు ట్విట్టర్ అకౌంట్ @ItsVishnuManchu అనేది కొద్ది నెలల క్రితం హ్యాకింగ్ కి గురైంది. అప్పటి నుండి విష్ణు సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్ ఫాంలో కనిపించడం లేదు.తాజాగా కొద్ది రోజుల క్రితమే @ItsVishnuManchu అనే సేం ఐడితో ఒక అకౌంట్ ని క్రియేట్ చేసారు. అందరూ మంచి విష్ణు మళ్ళీ ట్విట్టర్ లోకి వచ్చాడని అనుకున్నారు. ఆ అకౌంట్ ఫాలో అయ్యే వాళ్ళలో విష్ణు సిస్టర్ లక్ష్మీ మంచు, బ్రదర్ మంచు మనోజ్ కూడా ఉన్నారు. దాంతో ఈ ఈ అకౌంట్ కి ఫాలోయింగ్ పెరిగింది.

ఈ విషయంపై విష్ణు మంచు అధికారిక ప్రకటన చేసాడు. ఆ ట్విట్టర్ ఐడి నాది కాదు. అదొక ఫేక్ అకౌంట్ అని తెలియజేశాడు. ‘నేను మళ్ళీ ట్విట్టర్ లోకి రాలేదు, నేను ట్వీట్స్ వేయడం లేదని’ అని ఓ ప్రెస్ నోట్ ద్వారా మంచు విష్ణు తెలియజేశాడు.

Exit mobile version