పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ స్టార్ లైనప్ లో భారీ అంచనాలు ఉన్న సినిమా ‘స్పిరిట్’. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఓ పవర్ ఫుల్ కాప్ స్టోరీగా రాబోతుంది. ఐతే, ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ?, ఎప్పుడు రిలీజ్ కాబోతుంది ? అంటూ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ సినిమా గురించి మరో క్రేజీ అప్ డేట్ వచ్చింది. ఈ సినిమా కోసం ఓ సీనియర్ హీరోని తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మలయాళ సీనియర్ హీరో మమ్ముట్టిని తీసుకోవాలని చూస్తున్నారట.
మరి ఈ వార్తలో ఎంత వాస్తవం ఉందో చూడాలి. ఇక ఈ మూవీలో త్రిప్తి దిమ్రిని తీసుకున్న విషయం తెలిసిందే. కాగా మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ తో సందీప్ రెడ్డితో మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా పూర్తి చేశాడు. ఈ చిత్రాన్ని టి-సిరీస్ మరియు భద్రకాళి పిక్చర్స్ భారీ స్థాయిలో నిర్మించనున్నాయి. అన్నట్టు ‘స్పిరిట్’ మెయిన్ కథాంశమే చాలా కొత్తగా ఉంటుందని.. సందీప్ రెడ్డి వంగా నుంచి మరో వినూత్న సినిమా రాబోతుందని తెలుస్తోంది. ఈ సినిమ పై ప్రభాస్ ఫ్యాన్స్ భారీ హోప్స్ పెట్టుకున్నారు.