సూపర్ స్టార్ కి మరో ప్రతిష్టాత్మక అవార్డు !

mohanlal

మలయాళ సూపర్ స్టార్ హీరో మోహన్‌ లాల్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆయన నటనకు తెలుగు ప్రేక్షకులు కూడా ఫిదా అయ్యారు. అయితే, తాజాగా మోహన్ లాల్ కి అత్యంత ప్రతిష్టాత్మక దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు వరించడం విశేషం. మోహన్ లాల్ సినీ రంగానికి చేసిన సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం తాజాగా ఈ అవార్డును ప్రకటించింది. శనివారం కేంద్ర సమాచార, ప్రసారశాఖ ఈ విషయాన్ని తెలియజేస్తూ ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ పెట్టింది.

మోహన్ లాల్ 2023 సంవత్సరానికి గానూ దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు అందుకోబోతున్నారు. నటుడు, దర్శకుడు, నిర్మాతగా భారతీయ చలన చిత్రరంగానికి ఆదర్శవంతమైన సేవలను మోహన్ లాల్ అందించారని, అందుకే ఆయనకు ఈ అవార్డు అందుకునే సంపూర్ణ అర్హత ఉందని నెటిజన్లు కూడా పోస్ట్ లు పెడుతున్నారు. మొత్తానికి మోహన్‌లాల్‌ అద్భుత ప్రతిభ, పట్టుదలకు ఈ అవార్డు వచ్చింది. సెప్టెంబరు 23న జరిగే 71వ నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ ప్రదానోత్సవంలో మోహన్‌లాల్‌ ఈ అవార్డును అందుకుంటారు.

Exit mobile version