‘ఓజి’ గ్రాండ్ రిలీజ్ ఈవెంట్ పై క్రేజీ న్యూస్

OG movie

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన అవైటెడ్ చిత్రం “ఓజి” కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ గురించి క్రేజీ అప్ డేట్ వచ్చింది. ‘OG’ రేపు, సెప్టెంబర్ 21, 2025న సాయంత్రం 5:00 గంటల నుండి హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌లోని లాల్ బహదూర్ స్టేడియంలో గ్రాండ్ రిలీజ్ ఈవెంట్‌కు సిద్ధంగా ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పాటు మిగిలిన భారీ తారాగణం కూడా “OG కన్సర్ట్”కి హాజరు కానున్నారు.

ఈ విషయం గురించి టీమ్ అధికారికంగా తెలియజేసింది. ఇక ఈ సినిమాను తొలిరోజే చూసేందుకు ప్రేక్షకులు రెడీ అవుతున్నారు. ఇమ్రాన్ హష్మి, ప్రియాంక మోహన్, శ్రియా రెడ్డి, అర్జున్ దాస్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందించగా డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.

Exit mobile version