ప్రభాస్‌ను ‘కన్నప్ప’ ప్రమోషన్స్‌కు అందుకే తీసుకురాలేదు – విష్ణు మంచు

ప్రభాస్‌ను ‘కన్నప్ప’ ప్రమోషన్స్‌కు అందుకే తీసుకురాలేదు – విష్ణు మంచు

Published on Jun 26, 2025 6:00 PM IST

టాలీవుడ్ హీరో మంచు విష్ణు నటించిన లేటెస్ట్ మూవీ ‘కన్నప్ప’ రేపు గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయింది. ఈ సినిమాను దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేయగా డా.ఎం.మోహన్ బాబు అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేశారు. ఇక ఈ సినిమాను పాన్ ఇండియా భాషల్లో గ్రాండ్ రిలీజ్‌కు రెడీ చేశారు మేకర్స్. ఈ చిత్ర ప్రమోషన్స్‌ను కూడా అంతేస్థాయిలో నిర్వహించారు.

కాగా, ఈ సినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఓ కీలక పాత్రలో నటిస్తుండటంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. కానీ, ఈ చిత్ర ప్రమోషన్స్‌లో ప్రభాస్ ఎక్కడా కూడా కనిపించలేదు. దీంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే, తాజాగా ఈ చిత్ర ప్రమోషన్స్‌కు ప్రభాస్ ఎందుకు దూరంగా ఉన్నాడో విష్ణు క్లారిటీ ఇచ్చాడు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభాస్ గురించి తనకు పూర్తిగా తెలుసని.. ఆయనకు ఏ విషయం అంటే మొహమాటమో.. ఏదంటే మొహమాటం లేదో తనకు తెలుసని.. అందుకే ప్రభాస్‌ని ఈ చిత్ర ప్రమోషన్స్‌కు రావాలని బలవంతం చేయలేదని విష్ణు తెలిపాడు.

అంతేగాక, ఈ చిత్ర ప్రమోషన్స్ కోసం ఓ వీడియో బైట్ ఇవ్వాల్సిందిగా కోరగా.. చివరి క్షణంలో అది కూడా కుదర్లేదని ప్రభాస్ చెప్పినట్లు విష్ణు తెలిపాడు. దీంతో ఈ చిత్ర ప్రమోషన్స్‌కు ప్రభాస్ ఎందుకు దూరంగా ఉన్నాడో అభిమానులకు క్లారిటీ వచ్చేసింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు