2026 సంక్రాంతి సినిమాలు: ఓటిటి డీల్ పెండింగ్ ఉన్న సినిమాలివే!

2026 సంక్రాంతి సినిమాలు: ఓటిటి డీల్ పెండింగ్ ఉన్న సినిమాలివే!

Published on Nov 18, 2025 2:26 PM IST

sankranthi movies

ప్రతీ ఏటా మన తెలుగు సినిమా దగ్గర బిగ్గెస్ట్ ఫెస్టివల్ రిలీజ్ సీజన్ ఏదన్నా ఉంది అంటే అది సంక్రాంతి సీజన్ అనే చెప్పాలి. ఎన్నో ఏళ్ళు నుంచి సంక్రాంతి బరిలో ఎన్నెన్నో సినిమాలు వచ్చి సెన్సేషనల్ హిట్స్ అయ్యాయి. ఇలా ఈ 2025లో కూడా మన సీనియర్ స్టార్స్ సూపర్ హిట్స్ కొట్టారు.

ఇక నెక్స్ట్ సంక్రాంతి హీట్ కూడా ఆల్రెడీ మొదలైంది. తెలుగు బాక్సాఫీస్ దగ్గర అభిమానుల్ని అలరించేందుకు డబ్బింగ్ సినిమాలు కలిపి మొత్తం 7 సినిమాలు ప్రస్తుతానికి ఫిక్స్ అయ్యి ఉన్నాయి. ఇంట్రెస్టింగ్ గా ఆ సినిమాల్లో మన బిగ్ స్టార్స్ సినిమాలకి ఇంకా ఓటిటి డీల్ పూర్తి కాకపోవడం అనేది సస్పెన్స్ గా ఉంది. ఇక ఈ లిస్ట్ లో ఏయే సినిమాలు ఉన్నాయి. ఏ ఓటిటికి అవి లాక్ అయ్యాయో చూద్దాం.

‘మన శంకర వరప్రసాద్ గారు’:

మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు అనీల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ఆల్రెడీ మంచి బజ్ ఉంది. ఫ్యామిలీ ఆడియెన్స్ లో మంచి హైప్ ని సెట్ చేసుకున్న ఈ సినిమాకి ఇంకా ఓటిటి డీల్ పెండింగ్ లోనే ఉంది. ఫ్రంట్ రేస్ లో ప్రైమ్ వీడియో, జీ 5 ఉన్నట్టు తెలుస్తుంది.

‘జన నాయకుడు’:

తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న ఆఖరి సినిమా ఇది. దర్శకుడు హెచ్ వినోద్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా ఈ సినిమాని దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్నారు. దీనికి భారీ మొత్తంలోనే వారు ఇచ్చినట్టు టాక్.

‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’:

మాస్ మహారాజ రవితేజ హీరోగా దర్శకుడు కిషోర్ తిరుమల కాంబినేషన్ లో చేస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కూడా సంక్రాంతి రేస్ లో లాక్ అయ్యింది. అలాగే ఈ సినిమాని జీ 5 వారు సొంతం చేసుకున్నారు. సో దీనికి ఓటిటి డీల్ పూర్తయ్యిపోయింది.

‘పరాశక్తి’:

కోలీవుడ్ టాలెంటెడ్ హీరో శివ కార్తికేయన్ హీరోగా, దర్శకురాలు సుధా కొంగర తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఒక పీరియాడిక్ డ్రామాగా సంక్రాంతి బరిలో రాబోతుంది. అంత మంచి కాంబినేషన్ అయినప్పటికీ ఈ సినిమా ఓటిటి డీల్ ఇప్పటికీ పెండింగ్ లోనే ఉండడం ఆశ్చర్యకరం.

‘ది రాజా సాబ్’:

పాన్ ఇండియా స్టార్ హీరోగా దర్శకుడు మారుతీతో ప్లాన్ చేస్తున్న ఈ సాలిడ్ హారర్ ఎంటర్టైనర్ చిత్రమే ఇది. ట్రైలర్, టీజర్ లతో మంచి బజ్ ని ఈ సినిమా అందుకుంది కానీ ఈ సినిమా ఇంకా ఓటిటి డీల్ పూర్తి కాకపోవడం గమనార్హం. మేకర్స్ అనుకున్న రేంజ్ లో డీల్ కోసం చూస్తున్నట్టు టాక్.

‘అనగనగా ఒక రాజు’:

మన టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నవీన్ పొలిశెట్టి హీరోగా నటిస్తున్న అవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. మరి ఈ సినిమా అప్పుడు నుంచీ లేట్ అయినప్పటికీ ఓటిటి డీల్ ఆల్రెడీ పూర్తయ్యింది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది.

‘నారీ నారీ నడుమ మురారి’:

యువ హీరో శర్వానంద్ నటిస్తున్న లేటెస్ట్ సినిమాల్లో ఇదొకటి. దర్శకుడు రామ్ అబ్బరాజు తెరకెక్కిస్తున్న ఈ సినిమా కూడా సంక్రాంతి బరిలోనే ఫిక్స్ అయ్యింది కానీ ఈ చిత్రానికి కూడా ఇంకా ఓటిటి డీల్ అయితే పూర్తి కాలేదు.

సో మొత్తానికి ఇలా సంక్రాంతి రేస్ లో ఉన్న సినిమాల్లో మొత్తం ఏడింటికి ఇంకా నాలుగు సినిమాలు ఓటిటి డీల్స్ పెండింగ్ లో ఉన్నాయి. అవి రిలీజ్ సమయం దగ్గరికి వచ్చేసరికి అయినా పూర్తవుతాయా లేక వచ్చాక అవుతాయా అనేది చూడాలి.

తాజా వార్తలు