టాలీవుడ్లో తెరకెక్కిన డివోషనల్ డ్రామా చిత్రం ‘కన్నప్ప’ బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తోంది. ఈ సినిమాలో విష్ణు మంచు హీరోగా నటించగా దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. ఇక ఈ చిత్రాన్ని విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కించాడు. ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో డా. ఎం.మోహన్ బాబు ప్రొడ్యూస్ చేశారు. కాగా, ఈ సినిమా రిలీజ్ అయిన అన్ని చోట్ల మిశ్రమ స్పందన తెచ్చుకుంది.
ఈ చిత్రానికి టాక్ ఎలా ఉన్నా, బాక్సాఫీస్ దగ్గర తొలిరోజు ఓపెనింగ్ కలెక్షన్స్ మాత్రం భారీగానే వచ్చాయి. విష్ణు మంచు కెరీర్లోనే బెస్ట్ ఓపెనింగ్స్‌గా ఈ కలెక్షన్స్ నిలిచాయి. ఇక ఈ కలెక్షన్స్ ఈ స్థాయిలో రావడానికి ప్రభాస్ కారణమని మీడియా ప్రశ్నించగా.. విష్ణు ఈ విషయాన్ని ఓపెన్‌గా అంగీకరించాడు. ప్రభాస్ వల్లే ఈ కలెక్షన్స్ వచ్చాయి అనడంలో తనకు ఎలాంటి ఇగో లేదని విష్ణు తెలిపాడు.
ప్రభాస్ ఉన్నాడనే చాలా మంది ఈ సినిమాను చూసేందుకు వచ్చారని.. ఇక ఈ సినిమా చూశాక వారికి కన్నప్ప అంటే ఏమిటో తెలిసిందని విష్ణు కామెంట్ చేశాడు. ఏదేమైనా కన్నప్ప చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తున్నందుకు సంతోషంగా ఉందని విష్ణు తెలిపాడు.