300 థియేటర్లలో తెలుగులో విడుదలకానున్న విశాల్ సినిమా

300 థియేటర్లలో తెలుగులో విడుదలకానున్న విశాల్ సినిమా

Published on Oct 29, 2013 10:30 PM IST

Palnadu-Vishal
ఒకేరకం నేపధ్య పరిమితమైన సినిమాలతో మొదట్లో వరుస విజయాలు సాధించి తమిళ నటుడు విశాల్ తెలుగు సినిమా రంగానికి దగ్గరయ్యాడు. చివరిసారిగా విశాల్ బాల దర్శకత్వంలో ‘వాడు వీడు’ సినిమాలో కనిపించాడు. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అంతగా ప్రభావం చూపలేకపోయింది

ఇప్పుడు విశాల్ ‘పల్నాడు’ సినిమాద్వారా మరోసారి మనముందుకు రానున్నాడు. దీపావళి సందర్భంగా ఈ సినిమాను నవంబర్ 2 న విడుదల చేయనున్నారు. ఈ సినిమా దాదాపు 300 థియేటర్లలో విడుదలకానుంది. ఒక భాషేతర చిత్రం ఇన్ని థియేటర్లలో విడుదలకావడం మంచి శకునమే. ‘శివాజీ’ సినిమాలో వాడిన 4కె రిజల్యుషన్ పరిజ్ఞానాన్ని ‘మిర్చి’ సినిమా సినిమాటోగ్రాఫర్ ఆర్. మాధి ఈ సినిమాలో వాడారు. లక్ష్మి మీనన్ హీరోయిన్. డి. ఇమ్మాన్ సంగీత దర్శకుడు. శుసీంద్రన్ దర్శకుడు. విశాల్ ఈ సినిమాను తన సొంత బ్యానర్ అయిన ‘విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ’ ద్వారా విడుదల చేయనున్నాడు

తాజా వార్తలు