త్వరలో విడుదలకానున్న విశాల్ ఇంద్రుడు

త్వరలో విడుదలకానున్న విశాల్ ఇంద్రుడు

Published on Apr 13, 2014 4:43 AM IST

indrudu_movie
విశాల్, లక్ష్మి మీనన్ జంటగా నటించిన ఇంద్రుడు సినిమా తెలుగులో విడుదలకానుంది. నాన్ సిగప్పు మనితాన్ అనే తమిళ సినిమాకు ఇది డబ్బింగ్ వెర్షన్. తన నిద్రమీద తనకి కంట్రోల్ లేక నార్కొలెప్సీ అనే వ్యాధితో బాధపడే వ్యక్తి కధ

ఈ సినిమాను యు.టి.వి మోషన్ పిక్చర్స్ నిర్మాణంలో తిరు తెరకెక్కిస్తున్నాడు. ఏప్రిల్ 13న జరిగే ఈ సినిమా ఆడియో లాంచ్ లో చిత్ర బృందమంతా హాజరుకానుంది. తమిళంలో ఈ సినిమా విడుదలై మంచి విజయాన్ని సాధించింది. ఎంతో ఊరించిన హీరో హీరోయిన్ల మధ్య వుండే లిప్ లాక్ సినిమా చివర్లో వుండడం విశేషం

జి.వి ప్రకాష్ సంగీతదర్శకుడు. రిచర్డ్ నాథన్ సినిమాటోగ్రాఫర్

తాజా వార్తలు