కెరీర్ లో మొదటిసారిగా విశాల్, శృతిహాసన్ కలిసినటిస్తున్న సినిమాకు ‘పుజై’ అనే పేరుని ఖరారు చేసారు. హరి ఈ సినిమాకు దర్శకుడు. సూర్య నటించిన సింగం 2 విడుదలైన తరువాత హరి చేస్తున్న మొదటిప్రాజెక్ట్ ఇదే కాబట్టి అంచనాలు భారీ స్థాయిలోనే వున్నాయి
ఈ సినిమా ఈ వారంతరంలో లాంచనంగా ప్రారంభమై ఏప్రిల్ నుండి షూటింగ్ జరుపుకుంటుంది. సత్యరాజ్, రాధిక ముఖ్యపాత్రలుపోషించనున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతదర్శకుడు. ప్రస్తుతం హరి లోకేషన్ల వేటలో వున్నాడు
ప్రస్తుతం విశాల్ నటించిన ‘ఇంద్రుడు’ సినిమా ఏప్రిల్ 11న విడుదలకానుంది. లక్ష్మీ మీనన్ హీరోయిన్. విశాల్ ఆఖరి చిత్రం పల్నాడు కు మిశ్రమ స్పందన రావడంతో ఈ సినిమా పై చాలా అంచనాలు పెట్టుకున్నాడు