పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన భారీ చిత్రమే “ఓజి”. ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రం కోసం అభిమానులు మంచి ఉత్సాహంగా ఎదురు చూస్తుండగా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న అభిమానులకి ఆ బిగ్ డే నేటితో రానే వచ్చింది.
అయితే పవన్ కళ్యాణ్ కెరీర్లోనే ఇది ఎంతో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ అయితే ఈ ఒక్క సినిమాకే అన్ని పనులు కొంచెం సక్రమంగా జరిగాయి అనుకునే లోపు మళ్ళీ రిలీజ్ దగ్గరకి వచ్చేసరికి ఆయా సమస్యలు వినిపించాయి. ఇలా యూఎస్ మార్కెట్ లో కంటెంట్ డెలివరీ కూడా ఆన్ టైం లేదని షోస్ చాలా వరకు ప్రశ్నార్ధకం అన్నట్టుగా కూడా వినిపించింది.
కానీ ఫైనల్ గా ఈ సమస్యలు అన్నీ క్లియర్ అయినట్టుగా ఇపుడు తెలుస్తుంది. క్యూబ్ కి ఓజి కంటెంట్ డెలివరీ కాగా అన్ని అడ్డంకులు దాటుకొని ఓజి ఆన్ టైం షోస్ పడనున్నట్టు ఇపుడు టాక్. సో ఇక ఓజి విధ్వంసమే అని చెప్పాలి.