తండ్రి సక్సెస్ జర్నీని సోషల్ మీడియాలో పంచుకున్న విశాల్

తండ్రి సక్సెస్ జర్నీని సోషల్ మీడియాలో పంచుకున్న విశాల్

Published on May 2, 2020 12:30 AM IST

హీరో విశాల్ తండ్రి జి కృష్ణా రెడ్డి ప్రముఖ పారిశ్రామికవేత్తన్న సంగతి తెలిసందే. నిర్మాతగా కూడా అనేక సినిమాలు నిర్మించిన జి కె రెడ్డి మొదట ఇండియన్ సివిల్ డిఫెన్స్ ఆఫీసర్. ఓ సాధారణ పేద రైతు కుటుంబంలో పుట్టిన జి కె రెడ్డి అంచెలంచలుగా ఎదిగి ఉన్నత స్థాయికి చేరుకున్నారు. ఆయన సక్సెస్ జర్నీ పై ఓ ప్రముఖ ఇంగ్లీష్ డైలీ కథనం ప్రచురించగా దానిని విశాల్ సోషల్ మీడియాలో పంచుకొని ప్రౌడ్ గా ఫీలయ్యారు.

ఇక విశాల్ ప్రస్తుతం తన స్వీయ దర్శకత్వంలో తుప్పరివాలన్ మూవీకి సీక్వెల్ తెరకెక్కిస్తున్నాడు. తెలుగులో ఈ చిత్రం డిటెక్టీవ్ 2గా విడుదల కానుంది. 2017లో వచ్చిన తుప్పరివాలన్ కి సీక్వెల్ గా ఆయన ఈ మూవీ తెరకెక్కిస్తున్నారు. దర్శకుడు మిస్కిన్ మధ్యలో ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడంతో విశాల్ ఆ బాధ్యతలు తీసుకున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు