దర్శకుడిపై విశాల్ ఘాటు వ్యాఖ్యలు

దర్శకుడిపై విశాల్ ఘాటు వ్యాఖ్యలు

Published on Mar 12, 2020 3:01 AM IST

హీరో విశాల్ డిటెక్టివ్ గా చేసిన మొదటి చిత్రం తుప్పరివాలన్. 2017లో వచ్చిన ఈ చిత్రం తెలుగులో డిటెక్టివ్ పేరుతో విడుదలయ్యింది. కాగా తెలుగు తమిళ బాషలలో విజయం సాధించిన నేపథ్యంలో దీనికి సీక్వెల్ గా తుప్పరివాలన్ 2 తెరకెక్కిస్తున్నారు. కాగా ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడో మొదలైన నేపథ్యంలో కొంత షూటింగ్ కూడా పూర్తి అయ్యింది. ఐతే కారణాలేమైనా దర్శకుడు మిస్కిన్ అర్థాంతరంగా ప్రాజెక్ట్ నుండి బయటికి వెళ్లిపోయారు.

దీనితో దర్శకత్వ బాధ్యతలు స్వయంగా విశాల్ తీసుకున్నారు. కాగా సోషల్ మీడియా వేదికగా డైరెక్టర్ మిస్కిన్ ని ఉద్దేశించి విశాల్ కొంచెం ఘాటు వ్యాఖ్యలే చేశారు. అలాంటి వాళ్ళను బ్రతిమాలుడుతూ ఎవరు వెంట పడరు, ముఖ్యంగా నిర్మాతలు అని చెప్పడం జరిగింది. మిస్కిన్ లాంటి దర్శకుల వెంట ఎవరూ పడరు అని ఆయన పరోక్షంగా అన్నారు. ఇక ఈ చిత్రానికి విశాల్ నిర్మాత కూడా కావడం గమనార్హం.

తాజా వార్తలు