అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ డ్రామా చిత్రం ‘ఘాటి’ రిలీజ్‌కు రెడీ అయింది. దర్శకుడు క్రిష్ జాగర్లమూడి డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా సెప్టెంబర్ 5న థియేటర్లలో విడుదల కానుండగా ఇప్పటికే విడుదలైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకుల్లో అంచనాలు పెంచాయి.
అయితే, ఈ సినిమాలోకి ఇప్పుడు ఓ స్టార్ హీరో తల్లి కూడా అడుగు పెడుతోంది. కేజీయఫ్ హీరో యశ్ తల్లి పుష్ప అరుణ్ కుమార్, తన కొత్త డిస్ట్రిబ్యూషన్ సంస్థ ‘పి.ఎ.ఫిల్మ్స్’ ద్వారా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ రంగంలో అడుగుపెడుతున్నారు. ‘ఘాటి’ ఆమె పంపిణీ చేస్తున్న తొలి చిత్రం కావడం విశేషం.
ఈ సినిమాలో అనుష్క పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్, ప్రమోషనల్ వీడియోల్లో కనిపించిన విజువల్స్ చూసి పుష్పా ఎంతో మెప్పు పొందినట్లు సమాచారం. హీరోయిన్-సెంట్రిక్‌గా నడిచే ఈ కథ, తన డిస్ట్రిబ్యూషన్ కెరీర్‌కు సరైన ఆరంభమని ఆమె భావిస్తున్నారు.