మరోసారి తెలుగు మార్కెట్ పై కన్నేసిన తమిళ హీరో

మరోసారి తెలుగు మార్కెట్ పై కన్నేసిన తమిళ హీరో

Published on Jun 14, 2013 2:50 PM IST

Vishal
తమిళ నటుడు విశాల్ మరోసారి తెలుగులో తన ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. గతంలో తను నటించిన ‘పందెంకోడి’, ‘పొగరు’, ‘భయ్యా’ సినిమాలు తెలుగులో కూడా అనువాదమయ్యి ఇక్కడ మంచి విజయాన్ని సాధించాయి. కానీ ఆతరువాత ‘సెల్యూట్’, ‘వాడు వీడు’ వంటి సినిమాలు పరాజయం పాలవ్వడంతో ఇక్కడ అతని మార్కెట్ పూర్తిగా పడిపోయింది. ఇప్పుడు అతని మరో సినిమా ‘ధీరుడు’ అనే పేరుతొ అనువాదానికి సిద్ధంగావుంది. ‘పట్టాతు ఎన్నై’ అనేది దీని తమిళ వెర్షన్ టైటిల్. విశాల్ మొదటిసారిగా తన సొంత నిర్మాణ సంస్థ అయిన విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్ ద్వారా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. భూపతి పాండియన్ దర్శకుడు. థమన్ సంగీత దర్శకుడు. ఈ సినిమా ఆడియోను ఈ నెల 25న, సినిమాను వచ్చే నెలలో విడుదల చెయ్యనున్నారు. విశాల్ కు ఈ సినిమాతో మరో హిట్ రావాలని కోరుకుందాం.

తాజా వార్తలు