మెగాస్టార్ ‘వృషభ’ టీజర్ కి డేట్ ఖరారు!

మెగాస్టార్ ‘వృషభ’ టీజర్ కి డేట్ ఖరారు!

Published on Sep 16, 2025 2:00 PM IST

మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్ నుంచి ఈ ఏడాదిలోనే ఆల్రెడీ మూడు సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. వాటిలో రెండు తెలుగులో కూడా విడుదల అయ్యాయి. ఇక ఈ చిత్రాల తర్వాత తన నుంచి రాబోతున్న మరో భారీ చిత్రమే “వృషభ”. దర్శకుడు నంద కిషోర్ తెరకెక్కిస్తున్న ఈ భారీ పీరియాడిక్ చిత్రం నుంచి మేకర్స్ ఇపుడు సాలిడ్ అప్డేట్ ని అందించారు.

పాన్ ఇండియా భాషల్లో ఈ సినిమా అవైటెడ్ ట్రైలర్ ఈ సెప్టెంబర్ 18న విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఇక దీనిపై ఒక సాలిడ్ పోస్టర్ ని కూడా మోహన్ లాల్ పై డిజైన్ చేసి వదలడంతో తన అభిమానులు మంచి ఎగ్జైట్ అవుతున్నారు. ఇక ఈ చిత్రానికి రీసెంట్ సెన్సేషనల్ హిట్ మహావతార్ నరసింహ సంగీత దర్శకుడు సామ్ సి ఎస్ వర్క్ చేయగా కనెక్ట్, ఏ వి ఎస్ అలాగే బాలాజీ ఫిలింస్ లిమిటెడ్ వారు నిర్మాణం వహించారు.

తాజా వార్తలు