మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు వరుస హిట్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ తో “ఆచార్య” అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. భారీ అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రం షూట్ కూడా తొందరలోనే పునఃప్రారంభం కానుంది. అయితే ఈ భారీ ప్రాజెక్ట్ అనంతరం చిరు రెండు రీమేక్స్ చేస్తున్న విషయం కూడా తెలిసిందే.
వాటిలో “లూసిఫెర్” రీమేక్ ను వివి వినాయక్ తెరకెక్కిస్తుండగా అప్పుడే ఈ చిత్రానికి సంబంధించిన పనులు కూడా జరిగిపోతున్నాయి. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ ను పూర్తి చేయించిన వినాయక్ వచ్చే ఏడాది ఆరంభంలోనే షూట్ ను మొదలు పెట్టేలా సన్నాహాలు చేస్తున్నారు.
అయితే ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ తమన్నా కు ఒక స్పెషల్ ఎపిసోడ్ ను వినాయక్ సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఈ ఎపిసోడ్ చిత్రంలో కూడా కీలక పాత్ర పోషించనుందట. ఇప్పటికే తమన్నాను సంప్రదించగా ఆమె ఒప్పుకున్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తానికి మాత్రం ఈ విషయంలో మరింత క్లారిటీ రావాల్సి ఉంది.