సమీక్ష : తలైవన్ తలైవీ – కొన్నిచోట్ల మెప్పించే ఫ్యామిలీ డ్రామా

సమీక్ష : తలైవన్ తలైవీ – కొన్నిచోట్ల మెప్పించే ఫ్యామిలీ డ్రామా

Published on Jul 26, 2025 3:01 AM IST

Thalaivan-Thalaivii Movie Review

విడుదల తేదీ : జూలై 25, 2025

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు : విజయ్ సేతుపతి, నిత్యా మీనన్, యోగి బాబు తదితరులు
దర్శకత్వం : పాండిరాజ్
నిర్మాతలు : సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్
సంగీతం : సంతోష్ నారాయణన్
సినిమాటోగ్రఫీ : ఎం. సుకుమార్
ఎడిటర్ : ప్రదీప్ ఇ రాఘవ్

సంబంధిత లింక్స్ : ట్రైలర్ 

తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి, నిత్యా మీనన్ జంటగా నటించిన లేటెస్ట్ తమిళ చిత్రం ‘తలైవన్ తలైవీ’ నేడు థియేటర్లలో రిలీజ్ అయింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుందో ఈ రివ్యూలో చూద్దాం.

కథ :

అగసవీరన్(విజయ్ సేతుపతి) ఓ టిఫిన్ సెంటర్ నడుపుతుంటాడు. అతడు అరసి అలియాస్ పెరరసి (నిత్యా మీనన్)‌ను వివాహం చేసుకుంటాడు. వారి వైవాహిక జీవితం సాఫీగా సాగుతుంటుంది. కొద్ది రోజులకే వారి మధ్య విభేదాలు రావడంతో వారు తరుచూ గొడవపడుతుంటారు. దీని కారణంగా వారు మూడు నెలలపాటు దూరంగా ఉండటం.. ఆ తర్వాత విడాకులకు అప్లై చేయడం జరుగుతుంది. అయితే, అగసవీరన్ ఓ బలమైన కారణంతో తన వ్యక్తిగత విషయాన్ని కుటుంబ సమస్యగా మార్చేస్తాడు. అసలు వారి గొడవలకు గల కారణం ఏమిటి..? అసలు ఈ కథలో మలుపు ఏమిటి..? వారు రాజీ పడతారా లేక విడిపోయేందుకు సిద్ధమవుతారా..? అనేది సినిమా కథ.

ప్లస్ పాయింట్స్ :

తలైవన్ తలైవీ చిత్రానికి ప్రధాన బలం ఈ సినిమాలో విజయ్ సేతుపతి, నిత్యా మీనన్ జోడీ అని చెప్పాలి. వారి మధ్య వచ్చే కెమిస్ట్రీ, తమ పాత్రలపై వారు చూపే పట్టు ప్రేక్షకులను మెప్పిస్తుంది. ప్రేమానురాగాలతో వారు తమ పాత్రలను పోషించిన తీరు బాగుంది.

క్లైమాక్స్ ముందు వచ్చే ఓ సాలిడ్ సీన్‌లో విజయ్ ఓ బాధ్యత గల భర్తగా, కొడుకుగా చేసే పర్ఫార్మెన్స్ ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతుంది. ఈ సీన్‌లో ఆయన పండించిన ఎమోషన్ వర్కవుట్ అయింది.

కొన్ని చోట్ల కామెడీ సీన్స్ నవ్వించాయి. పాత్రల మధ్య వచ్చే సన్నివేశాలలో ఈ కామెడీ పండటం ప్రేక్షకులను ఇంప్రెస్ చేస్తుంది. సంతోష్ నారాయణన్ బీజీఎం ఎమోషనల్ సీన్స్‌ను పండించడంలో విజయం సాధించింది. ఈ అంశాలన్నీ కూడా సినిమాను ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా చేశాయి.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమా కథనం చాలా రొటీన్‌గా సాగడం మైనస్. కొంతవరకు కొత్తగానే ఉన్న కథ రానురాను రొటీన్ టెంప్లేట్‌గా మారడంతో సినిమాపై ఆసక్తి తగ్గిపోతుంది. ఇది ప్రేక్షకుల్లో నిరాశను కలిగిస్తుంది.

ఒక చిన్న సమస్య చుట్టూ కథ తిరుగుతుండడంతో స్క్రీన్ ప్లే ఒకే విధంగా అనిపిస్తుంది. గొడవలతో వచ్చే సీన్స్‌తో చాలా రొటీన్‌గా కథ సాగుతుంది. ఇది పదేపదే వస్తుండటం కూడా ఒకింత అసహనానికి గురిచేస్తుంది.

తెరపై చాలా పాత్రలు ఉండటం.. కానీ వాటిలో కొన్నింటికే ప్రాధాన్యత కనిపించడం ప్రేక్షకులను మెప్పించదు. చాలా పాత్రలు కేవలం స్క్రీన్ ప్రెజెన్స్ కోసమే ఉన్నట్లు అనిపిస్తుంది. యోగి బాబు కొన్ని సీన్స్‌లో నవ్వించినా ఆయనను పూర్తిగా వినియోగించుకోలేకపోయారు.

భార్యభర్తలు తరుచూ అరుచుకోవడంతో వారి మధ్య ఎమోషనల్ బాండింగ్ దూరమవుతుందనే పాయింట్‌ను సరిగా చెప్పలేకపోయారు. ఇలాంటి సీన్స్‌పై కాస్త జాగ్రత్తగా ఉండాల్సింది. ఇక సెకండాఫ్‌లో కథ ఆసక్తికరంగా కాకుండా ట్రాక్ తప్పినట్లుగా సాగడం మరో మేజర్ మైనస్.

సాంకేతిక విభాగం :

దర్శకుడు పాండిరాజ్ వాస్తవ సంబంధాలు ఎలా దూరమవుతున్నాయి అనే పాయింట్‌ను ప్రెజెంట్ చేయాలని చేసిన ప్రయత్నం కొంతవరకు పర్వాలేదనిపించింది. కానీ, ఆయన ఈ విషయాన్ని మరింత చక్కగా ఎగ్జిక్యూట్ చేసి ఉండాల్సింది. స్క్రీన్ ప్లే మరింత బలంగా ఉండి ఉంటే ఫలితం వేరేలా ఉండేది. సంతోష్ నారాయణన్ సంగీతం పర్వాలేదు. ముఖ్యంగా బీజీఎం స్కోర్ చాలా సీన్స్‌కు చక్కగా కుదురింది. ఎం.సుకుమార్ సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. ప్రదీప్ ఇ. రాఘవ్ ఎడిటింగ్ వర్క్ ఇంకా బెటర్‌గా ఉండాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు :

ఓవరాల్‌గా చూస్తే, ‘తలైవన్ తలైవీ’ ఒక ఫ్యామిలీ డ్రామాగా కొన్ని మూమెంట్స్‌తో కొంతవరకు ఓకే అనిపిస్తుంది. విజయ్ సేతుపతి, నిత్యా మీనన్ సాలిడ్ పర్ఫార్మెన్స్‌లు ఆకట్టుకుంటాయి. కానీ, రిపీటెడ్ సీన్స్, నెరేషన్ డల్‌గా సాగడం వంటి అంశాలు కథను బలహీనంగా చేశాయి. హానెస్ట్ అటెంప్ట్, కామెడీ ఇందులో ఉన్నప్పటికీ, ప్రేక్షకులను ఎంగేజ్ చేయడంలో అవి సక్సెస్ కాలేకపోయాయి. ఫ్యామిలీ డ్రామాలను ఇష్టపడేవారు తక్కువ అంచనాలతో ఈ సినిమాను ట్రై చేయవచ్చు.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team 

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు