సమీక్ష: ‘మహావతార నరసింహ’ – ఇంప్రెస్ చేసే డివోషనల్ యాక్షన్ డ్రామా

సమీక్ష: ‘మహావతార నరసింహ’ – ఇంప్రెస్ చేసే డివోషనల్ యాక్షన్ డ్రామా

Published on Jul 26, 2025 3:02 AM IST

MahaAvatar-Narasimha

విడుదల తేదీ : జూలై 25, 2025

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

దర్శకత్వం: అశ్విన్ కుమార్
నిర్మాతలు : కుషాల్ దేశాయ్, చైతన్య దేశాయ్
సంగీతం & నేపథ్య సంగీతం: సామ్ సి ఎస్
ఎడిటర్ : అజయ్ వర్మ, అశ్విన్ కుమార్

సంబంధిత లింక్స్ : ట్రైలర్ 

లేటెస్ట్ గా థియేటర్స్ లో రిలీజ్ కి వచ్చిన చిత్రాల్లో కన్నడ ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబళే ఫిల్మ్స్ వారు నిర్మాణం వహించిన భారీ యానిమేషన్ అండ్ డివోషనల్ చిత్రం “మహావతార నరసింహా” కూడా ఒకటి. మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం రండి.

కథ:

ఇక కథలోకి వస్తే కశ్యప ముని భార్యలలో ఒకరైనటువంటి దితి ఓనాడు కామ మోహితురాలై సరైన సమయం కానప్పటికీ కశ్యప మునితో సంగమిస్తుంది. ఇది తగిన సమయం కాదని వారించినా దానికి ప్రతిఫలం పుట్టే బిడ్డ రాక్షస అంశతో పుట్టే అవకాశం ఉందని చెప్పినా కూడా కశ్యపునితో సంగమిస్తుంది. అందుకు ప్రతిఫలంగా అత్యంత క్రూర కవలలు హిరణ్య కశిప, హిరాణ్యాక్షులు పుడతారు. వీరి అకృత్యాలకు అడ్డు ఉండదు. వీరిని మహా విష్ణువుకి శత్రువులుగా వారి గురువు శుక్రాచార్యుడు పెంచుతాడు. అప్పటికే అసురులలో మేటిగా నిలిచిన వీరిద్దరిలో విష్ణు అవతారాల్లో ఒకటైన వారాహి అవతారం హిరణ్యాక్షుని హతమారుస్తాడు. దానితో హిరణ్య కశిపునికి విష్ణువుపై మరింత ద్వేషం పెరుగుతుంది. దీనితో కఠోర తపస్సు చేసి బ్రహ్మ నుంచి ఓ వరాన్ని పొందుతాడు. ఈ క్రమంలోనే తనకి పుట్టిన బిడ్డ ప్రహ్లాదుడు విష్ణు భక్తుడుగా పుడతాడు. ఇది హిరణ్య కశిపునికి నచ్చదు. అక్కడ నుంచి కథ ఎలా మారింది? ప్రహ్లాదుడు భక్త ప్రహ్లదుడుగా ఎలా మారాడు? నరసింహా అవతారం ఎలా ఉద్భవించింది? ఇంట కానీ బయట కానీ, మనిషి చేత కానీ మృగం చేత కానీ, నేల మీద కానీ నింగిలో కానీ మరణం ఉందని హిరణ్యకశిపుని అంతం నరసింహావతారం ఎలా చేసింది అనేవి తెలియాలి అంటే ఈ చిత్రాన్ని వెండితెరపై చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్:

మొదటిగా ఇలాంటి ప్రయోగాన్ని ఇండియన్ సినిమా దగ్గర చేసిన నిర్మాణ సంస్థ హోంబళే ఫిల్మ్స్, క్లీం ప్రొడక్షన్స్ వారి ప్రత్యేక ప్రయత్నాన్ని అభినందించి తీరాలి. ఇండియన్ సినిమా దగ్గర యానిమేటెడ్ తరహా సినిమాలు చాలా తక్కువ అలాంటి జానర్ లో ఒక ఊహించని డివోషనల్ యాక్షన్ చిత్రాన్ని అందించే ప్రయత్నం చేయడం హర్షణీయం. ఇంకా ఈ డివోషనల్ చిత్రం బిగ్ స్క్రీన్స్ పై ఈ తరహా చిత్రాలు ఇష్టపడే వారికి మంచి ట్రీట్ ఇస్తుంది అని చెప్పవచ్చు.

సినిమా ఆరంభమైన మొదటి నలబై నిమిషాలు కథనం మంచి ఎగ్జైటింగ్ గా ఉత్సాహభరితంగా కొనసాగుతుంది. ముఖ్యంగా ఫస్టాఫ్ లో వచ్చే వరాహ అవతార ఎపిసోడ్ అయితే నెక్స్ట్ లెవెల్ ట్రీట్ అందిస్తుంది. క్రేజీ యాక్షన్ సన్నివేశాలు ఆ గ్రాండ్ విజువల్ కంటికి ట్రీట్ ని అందిస్తాయి. అలాగే ప్రహ్లాదునికి మహా విష్ణువుకి సంబంధించిన అన్ని సన్నివేశాలు కూడా బాగున్నాయి.

ప్రహ్లాదుని కాపాడే ఎపిసోడ్స్ వాటిని డిజైన్ చేసిన విధానం ఇంప్రెస్ చేస్తుంది. అలాగే కొన్ని కొన్ని ఎమోషనల్ మూమెంట్స్ కూడా ఆడియెన్స్ ని కదిలిస్తాయి. ఇక వీటితో పాటుగా ఈ యానిమేషన్ సినిమా కోసం సృష్టించిన ప్రపంచం అద్భుతం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. భూలోకం నుంచి స్వర్గ లోకం, బ్రహ్మలోకం ఇలా ఒక అద్భుతమైన ఫాంటసీ ప్రపంచాన్ని మేకర్స్ డిజైన్ చేసి ఆశ్చర్యపరిచారు.

ఇక లాస్ట్ సెన్సేషనల్ ట్రీట్ మహావతార నరసింహా అవతారం వచ్చిన తర్వాత నుంచి సినిమా నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోతుంది. ఇంట్రెస్టింగ్ గా మిగతా పాత్రలు అన్ని విజువల్స్ యానిమేటెడ్ గానే ఉన్నాయి కానీ ఒక్క నరసింహా అవతారం మాత్రం నిజంగా నరుడు, సింహాన్ని కలిపితే ఎంత సహజంగా కనిపిస్తుందో ఆ రీతిలో ఉంది. ఇక అక్కడ నుంచి నరసింహ అవతార తాండవం మామూలు ట్రీట్ అందించదు.

బీ, సి సెంటర్ ఆడియెన్స్ విజిల్ కొట్టి ఎంజాయ్ చేసే రేంజ్ లో ఈ అవతారాన్ని దర్శకుడు ప్రెజెంట్ చేసాడు. తనపై యాక్షన్ సన్నివేశాలు కానీ ఎలివేషన్స్ గాని ఖచ్చితంగా ఊహాతీతంగా ఉన్నాయి. అలాగే మహా విష్ణువుపై చూపించిన సన్నివేశాలు కూడా అద్భుతంగా ఉన్నాయి. ఇంకా ప్రతీ పాత్ర కూడా సరిగ్గా సరిపోయింది. యానిమేటెడ్ వెర్షన్ లో ఏ పాత్ర ఎలా ఉండాలి అని చేసుకున్న డిజైన్ చాలా బాగున్నాయి.

మైనస్ పాయింట్స్:

ఒక ఇంట్రెస్టింగ్ స్టార్ట్ నుంచి దాదాపు నలభై నిమిషాల మేర కథనం అంతా బాగానే ఉంటుంది కానీ ఆ తర్వాత నుంచి మూమెంట్స్ ఒకింత డల్ అయ్యాయని చెప్పక తప్పదు. ముఖ్యంగా ఒక ఫ్లోలో వెళుతున్న సినిమాకి పాటలు టచ్ దెబ్బ తీసినట్టు అనిపిస్తుంది. భక్తి పరంగానే ఉన్నప్పటికీ వెళుతున్న కథనానికి ఇవి అడ్డుకట్టగా అనిపిస్తాయి.

అలాగే అక్కడక్కడా మూమెంట్స్ కూడా కొంచెం స్లో కావడంతో ప్రీ క్లైమాక్స్ వరకు కథనం మరీ అంత ఎగ్జైటెడ్ గానూ సాగదు అలాగే నిరుత్సాహంగా కూడా అనిపించదు. ఇక వీటితో పాటుగా కొన్ని అంశాలు లాజిక్ పరంగా కూడా ఆలోచించాల్సి వస్తుంది. హిరణ్య కశిపుడు సోదరి హోళికపై ఎపిసోడ్ బాగానే ఉంది కానీ చావు లేని వరం ఉండి కూడా ఆమెని కాపాడుకోలేని నిస్సహాయతకి పొంతన లేదు.

అలాగే క్లైమాక్స్ లో నరసింహా అవతారం వచ్చే ముందు ప్రహ్లాదునికి, హిరణ్యకశిపునికి మరింత డ్రామా పెట్టి ఉంటే బాగుండేది. వారి నడుమ మాటల యుద్ధం లాంటి ఎలిమెంట్స్ లేకుండా సింపుల్ గానే ముగుస్తుంది. సి వీటి విషయంలో కొంచెం ఆడియెన్స్ నిరుత్సాహ పడవచ్చు. అలాగే ఒకటీ రెండు చోట్ల యానిమేషన్ లో లోపాలు కనిపిస్తాయి.

సాంకేతిక వర్గం:

ఈ చిత్రం టెక్నికల్ గా చాలా బలంగా ఉందని చెప్పి తీరాలి. క్లీం ప్రొడక్షన్స్ ఎంత బడ్జెట్ పెట్టారో కానీ ప్రతీ రూపాయి విజువల్స్ రూపంలో కనిపిస్తుంది. ఆ ప్రొడక్షన్ డిజైన్ కానీ ప్లాన్ చేసుకున్న యాక్షన్ సీక్వెన్స్ లు, ఫాంటసీ ప్రపంచాలు పాత్రలు ప్రతీది కొత్తగా అబ్భురపరిచేలా కనిపిస్తాయి. ఖచ్చితంగా ఇలాంటి ప్రోడక్ట్ ని ఇచ్చిన హోంబళే మేకర్స్ ప్రయత్నం మెచ్చుకొని తీరాల్సిందే. అలాగే తెలుగు డబ్బింగ్ కానీ ఇంట్రెస్టింగ్ గా ఇది ఎక్కడా కన్నడ డబ్బింగ్ సినిమాలా లేనే లేదు. మాటలు పాత్రలు మాట్లాడే నోటి కదలిక పర్ఫెక్ట్ గా చేయడం ఆశ్చర్యం.

అలాగే సినిమాకి మరో వెన్నుముక సామ్ సి ఎస్ సంగీతం అని చెప్పాలి. తన స్కోర్, పాటలు సినిమాని చాలా ఎలివేట్ చేసాయి. ఇక దర్శకుడు అశ్విన్ కుమార్ విషయానికి వస్తే.. తానే ఎడిటర్ గా కూడా చేశారు. అయితే తన వర్క్ ఎడిటింగ్ పరంగా ఇంకొంచెం బెటర్ గా చేయాల్సింది కానీ దర్శకత్వం పరంగా మంచి మార్కులు ఇవ్వవచ్చు. తాను క్రియేట్ చేసుకున్న ప్రపంచం అద్భుతంగా ఉంది. మంచి లైన్ అందుకు తగ్గట్టుగా ప్లాన్ చేసుకున్న కథనం బాగున్నాయి. కానీ కొన్ని మూమెంట్స్ వరకు ఇంకా జాగ్రత్త పడాల్సింది.

తీర్పు:

ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ ‘మహావతార నరసింహా’ యానిమేషన్ చిత్రం డివోషనల్ అందులో యాక్షన్ ఎలిమెంట్స్ ముఖ్యంగా మహా విష్ణు భక్తులకి అయితే ఒక ట్రీట్ అని చెప్పవచ్చు. మేకర్స్ సృష్టించిన ప్రపంచం, అందులో యాక్షన్ ఎలిమెంట్స్ అలాగే ఎమోషనల్ మూమెంట్స్ ఇంకా ఫస్టాఫ్ లో వరాహ, క్లైమాక్స్ లో నరసింహా అవతారాలు ఆడియెన్స్ ని కట్టి పడేస్తాయి. అలాగే విష్ణువు, ప్రహ్లాదునిపై సన్నివేశాలు కూడా చాలా బాగున్నాయి. కాకపోతే కొన్ని మూమెంట్స్ మాత్రం ఫ్లాస్ గా నిలిచాయి. ఇవి పక్కన పెడితే ఈ చిత్రం ఆడియెన్స్ కి ట్రీట్ ఇస్తుంది. 3డి వెర్షన్ లో ట్రై చేస్తే ఇంకా బెటర్.

123telugu.com Rating: 3/5

Reviewed by 123telugu Team 

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు