‘భగవంత్ కేసరి’కే రీమేక్? జన నాయగన్ లీక్ వైరల్

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటించిన రీసెంట్ చిత్రం “డాకు మహారాజ్” కి ముందు మరిన్ని సాలిడ్ హిట్స్ తన నుంచి ఉన్న సంగతి తెలిసిందే. మరి ఈ చిత్రాల్లో దర్శకుడు అనీల్ రావిపూడితో చేసిన చిత్రం భగవంత్ కేసరి కూడా ఒకటి. ఈ సినిమా కూడా పెద్ద హిట్ కాగా ఈ చిత్రాన్నే తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ రీమేక్ చేస్తున్నట్టుగా రూమర్స్ వచ్చాయి.

విజయ్ ఇపుడు చేస్తున్న జన నాయగన్ సినిమా భగవంత్ కేసరి రీమేక్ అని ఎప్పుడు నుంచో టాక్ ఉంది కానీ అధికారికంగా మాత్రం కన్ఫర్మ్ కాలేదు. అయితే విజయ్ తో దర్శకుడు హెచ్ వినోద్ మరో సినిమా చేస్తున్నాడని కూడా టాక్ వచ్చింది కానీ లేటెస్ట్ గా ఓ లీక్ ఇపుడు వైరల్ గా మారింది.

ఇందులో విజయ్ పోలీస్ గెటప్ లో కనిపించడంతో అభిమానులు ఎగ్జైట్ అవుతున్నారు. మరి భగవంత్ కేసరిలో కూడా బాలయ్య నార్మల్ వెర్షన్ తో పాటుగా పోలీస్ గెటప్ లుక్ కూడా ఉంటుంది. సో మళ్ళీ మ్యాచ్ అయ్యేసరికి విజయ్ చివరి చిత్రం భగవంత్ కేసరి రీమేక్ అనే అనుకోవచ్చు. ఇక ఈ అవైటెడ్ సినిమా వచ్చే ఏడాది జనవరి 9న రిలీజ్ కి రాబోతుంది.

Exit mobile version