జీవితకాలం ఆడే సినిమారా ‘చిరంజీవి’.. బ్లడ్ ప్రామిస్ చేసిన డైరెక్టర్..!

Srikanth-odela-chiru

టాలీవుడ్‌లో ఎందరు స్టార్‌లు ఉన్నా, మెగాస్టార్ మాత్రం ఒక్కడే.. ఆయనే మన మెగాస్టార్ ‘పద్మవిభూషణ్’ చిరంజీవి. నేడు(ఆగస్టు 22) మెగాస్టార్ చిరంజీవి 70వ పుట్టినరోజు జరుపుకుంటుండటంతో టాలీవుడ్ స్టార్స్ మొదలుకొని డై హార్డ్ ఫ్యాన్స్ వరకు అందరూ ఆయనకు బర్త్ డే విషెస్ చెబుతూ సోషల్ మీడియాను రఫ్ఫాడిస్తున్నారు. ఇక మెగాస్టార్ హార్డ్ కోర్ అభిమానుల్లో ఒకడైన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల చిరుపై తనకున్న అభిమానాన్ని తాజాగా ఓ ప్రత్యేక పోస్ట్ ద్వారా చాటుకున్నాడు.

చిరు బర్త్ డే సందర్భంగా ఆయనపై తనకున్న అభిమానాన్ని ఈ విధంగా చాటుకున్నాడు. ‘‘ నువ్ నా డెమీ గాడ్. చిరంజీవితో ఒక ఫోటో దిగి ఇంట్లో అమ్మకు చూపెడితే.. ఫస్ట్ టైమ్ నువ్ ఫోటోలో నవ్వడం చూస్తున్నారా అని చెప్పింది.. దటీజ్ మై డెఫినీషన్ ఆఫ్ చిరంజీవి. ఏం చేస్తాడు రా నీ చిరంజీవి అంటే.. నా లాంటి ఇంట్రోవర్ట్ గాడితో ఇంద్ర స్టెప్ చేయించగలడు.. సినిమా టికెట్లు కొనుక్కునేవాడితో సినిమా తీయించగలడు. నీయమ్మ.. జీవితకాలం ఆడే సినిమా రా చిరంజీవి. ఇప్పుడు చిరంజీవితో సినిమా అంటే జీవితకాలం గుర్తుండిపోయేలా తీయడం తప్ప ఇంకో ఆప్షన్ లేదు. ఆండ్ ఫైనల్లీ.. ఐ మిస్ మై చిరంజీవి ఆన్ స్క్రీన్.. ఐ ప్రామిస్ ఐ విల్ బ్రింగ్ హిమ్ బ్యాక్.. నా కోసం నేనే తీస్తున్న సినిమా ఇది. నా లాంటి ప్రతి చిరంజీవి అభిమాని కోసం తీస్తున్న సినిమా.. చిరు-ఓదెల.. ఇట్స్ ఎ బ్లడ్ ప్రామిస్..!!’’ అంటూ శ్రీకాంత్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

త్వరలోనే మెగాస్టార్ చిరంజీవితో ఓ సాలిడ్ సినిమా చేయనున్న దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, చిరు అభిమానిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. కేవలం ‘దసరా’ సినిమాతో ఆయన తనలోని ట్యాలెంట్‌ను ప్రూవ్ చేసుకున్నాడు. ఇక చిరు-ఓదెల కాంబినేషన్‌లో రాబోయే ప్రాజెక్ట్ కోసం అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక శ్రీకాంత్ ఓదెల లాంటి డై హార్డ్ ఫ్యాన్‌తో చిరు సినిమా చేస్తుండటంతో ఈ మూవీ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

Exit mobile version