విజయ్ దేవరకొండ రొమాంటిక్ అండ్ ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్ వరల్డ్ ఫేమస్ లవర్ డిజిటల్ ఫార్మాట్ లో దుమ్మురేపుతోంది. ఏకంగా ఈ చిత్రం ఇండియా వైడ్ గా సెకండ్ పోజిషన్ లో ట్రెండ్ అవుతుంది. వరల్డ్ ఫేమస్ లవర్ డిజిటల్ హక్కులను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. కాగా రెండు రోజుల క్రితం ఈ మూవీని నెట్ ఫ్లిక్స్ ఆడియన్స్ కి అంబాటులోకి తెచ్చింది. విశేష ఆదరణ దక్కించుకుంటున్న వరల్డ్ ఫేమస్ లవర్ మూవీ ఇండియా వైడ్ గా నెట్ ఫ్లిక్స్ లో ట్రెండ్ అవుతూ సంస్థకు కాసుల వర్షం కురిపిస్తుంది.
ఈ మూవీ థియేటర్స్ లో అనుకున్నంత విజయం సాధించలేకపోయింది. తెలుగు మరియు తమిళ్ లో విడుదలైన ఈ చిత్రం నిర్మాతలకు నష్టాలు మిగిల్చింది. అలాంటిది డిజిటల్ ఫార్మాట్ లో ఇంతటి ఆదరణ దక్కించుకోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇక విజయ్ దేవరకొండ గత చిత్రం డియర్ కామ్రేడ్ కూడా థియేటర్స్ లో విఫలం చెంది, ఓ టి టి ప్లాట్ ఫార్మ్ లో విజయం సాధించింది. సీనియర్ నిర్మాత కే ఎస్ రామారావు వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రాన్ని తెరకెక్కించగా, క్రాంతి మాధవ్ దర్శకత్వం వహించాడు.