టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరియు సెన్సేషనల్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ ఈ ఇద్దరూ ఇపుడు పాన్ ఇండియన్ సినిమాలతో రెడీ అవుతున్నారు. అలాగే గత కొన్నేళ్ల నుంచి మంచి స్నేహపూర్వకమైన బాండింగ్ ఉన్న సంగతి కూడా అందరికీ తెలిసిందే. అది ఎన్నో సందర్భాల్లో కూడా బయటపడింది.
అయితే ఇప్పుడు లేటెస్ట్ గా మన రౌడీ హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు ఒక స్పెషల్ గిఫ్ట్ ను పంపగా దానిని బన్నీ తన ఇన్స్టా స్టోరీలో పెట్టి విజయ్ కు స్పెషల్ థాంక్స్ ను చెప్పారు. విజయ్ కు తన బ్రాండింగ్ రౌడీ వేర్ ఉన్న సంగతి తెలిసిందే.
దాని నుంచి బన్నీ కోసం స్పెషల్ గా డిజైన్ చేయించబడ్డ టీ షర్ట్ మరియు స్పెషల్ ట్రాక్ మరియు రౌడీ డిజైన్ మాస్క్ లను పంపాడు. దీనితో వాటిని బన్నీ తన ఇన్స్టా స్టోరీలో పెట్టి ఈ స్పెషల్ కలెక్షన్ ను తన కోసం పంపినందుకు చాలా థాంక్స్ అని తెలిపారు. బన్నీకు రౌడీ పంపిన ఆ స్పెషల్ గిఫ్ట్ ను మీరు కూడా చూడండి.