బద్రి జ్ఞాపకాలు పంచుకున్న దేవరకొండ

బద్రి జ్ఞాపకాలు పంచుకున్న దేవరకొండ

Published on Apr 20, 2020 5:58 PM IST


విజయ్ దేవరకొండ 20ఏళ్ల క్రితం వచ్చిన బ్లాక్ బస్టర్ బద్రి జ్ఞాపకాలు పంచుకున్నాడు. బద్రి సినిమా ఆయన 6వ తరగతిలో ఉన్నప్పుడు వచ్చిందట. ఆ సినిమాను ఎంతో ఎంజాయ్ చేసిన విజయ్ ముఖ్యంగా ‘ఏ చికీతా…’ సాంగ్ ఎప్పుడూ పాడుతూ ఉండే వాడట. ఇక దర్శకుడు పూరీని చాల మిస్ అవుతున్నట్లు, 20ఏళ్ల సినీ కెరీర్ పూర్తి చేసుకున్న ఆయన మంచి మంచి సినిమాలు చేయాలనని, ఆరోగ్యంతో బాగుండాలని కోరుకున్నాడు.

విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి దర్శకత్వంలో మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఫైటింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్ ప్రొఫెషనల్ ఫైటర్ రోల్ చేస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా విడుదల కానున్న ఈ మూవీ ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. పూరి కనెక్ట్స్ మరియు ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తుండగా, అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు