ఆసుపత్రిలో చేరిన విజయ్ దేవరకొండ.. కారణం ఏమిటంటే..?

ఆసుపత్రిలో చేరిన విజయ్ దేవరకొండ.. కారణం ఏమిటంటే..?

Published on Jul 17, 2025 10:04 PM IST

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ తన నెక్స్ట్ చిత్రం ‘కింగ్డమ్’ చిత్ర ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా పూర్తి యాక్షన్ డ్రామాగా ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతోంది. ఇక ఈ సినిమాలో విజయ్ దేవరకొండ పాత్ర ప్రేక్షకులను పూర్తిగా మెస్మరైజ్ చేస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

అయితే, ఈ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న విజయ్ దేవరకొండ తాజాగా ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది. ఆయన డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని కోరుతున్నారు.

ఇక కింగ్డమ్ చిత్రంలో అందాల భామ భాగ్యశ్రీ బొర్సె హీరోయిన్‌గా నటిస్తుండగా సత్యదేవ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్లు ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఈ చిత్రాన్ని జూలై 31న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు