తెలుగు ఆడియెన్స్ లో మంచి ఆదరణ ఉన్న తమిళ హీరోస్ లో నటుడు అలాగే దర్శకుడు విజయ్ ఆంటోనీ కూడా ఒకరు. మరి తన నుంచి ఈ ఏడాదిలోనే రెండు థ్రిల్లర్ సినిమాలు వచ్చాయి. అలా లేటెస్ట్ గా వచ్చిన పొలిటికల్ థ్రిల్లర్ చిత్రమే ‘భద్రకాళి’. దర్శకుడు అరుణ్ ప్రభు తెరకెక్కించిన ఈ చిత్రానికి తెలుగు, తమిళ ఆడియెన్స్ నుంచి మంచి టాక్ దక్కింది.
అయితే థియేటర్స్ నుంచి రన్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం ఇప్పుడు ఓటిటిలో అలరించేందుకు వచ్చేస్తుంది. ఈ సినిమా హక్కులు ఓటిటి సంస్థ జియో హాట్ స్టార్ వారు సొంతం చేసుకోగా అందులో ఈ సినిమా ఈ అక్టోబర్ 24 నుంచి తెలుగు, తమిళ భాషలు సహా కన్నడ, మలయాళంలో కూడా వస్తుంది అని కన్ఫర్మ్ చేశారు. ఇక ఈ చిత్రానికి విజయ్ ఆంటోనీనే సంగీతం, నిర్మాణం కూడా వహించారు.