ఫేమస్ సింగర్ పి.బి శ్రీనివాస్ ఈ రోజు మధ్యాహ్నం చెన్నైలో కన్నుమూశారు. అయన వయసు 83 సంవత్సరాలు. ఈ లేజండ్రీ సింగర్ 1930లో కాకినాడలో జన్మించారు. ఆయన తన బి కామ్ కంప్లీట్ కాగానే సింగర్ గా కెరీర్ ని ప్రారంభించాడు. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ ఇండస్ట్రీల్లో శ్రీనివాస్ గారికి మంచి గుర్తింపు ఉంది.
కన్నడ లెజెండ్ డా. రాజ్ కుమార్ తో కలిసి శ్రీనివాస్ సింగర్ గా ఎంటర్ అయ్యారు. 1960 లలో ‘కులగోత్రాలు’, ‘గుడిగంటలు’, ‘ప్రేమించి చూడు’ మొదలైన హిట్ సినిమాలకు పాటలు పాడారు. పి.బి శ్రీనివాస్ సినిమా పాటలకే కాకుండా భాతి పాటలకు కూడా బాగా ఫేమస్ ఉదాహరణకి ‘శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం మొదలైనవి ఆయన పాడినవే.
ఈ సందర్భంగా పి.బి శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు 123తెలుగు.కామ్ తరపున సంతాపాన్ని తెలియజేస్తున్నాం.