బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో రిషి కపూర్ అస్వస్థతకు గురికావడంతో ఆయన్ని ముంబైలోని హెచ్ ఎన్ రిలయన్స్ హాస్పిటల్ లో చేర్చారు. సడన్ గా ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడంతో కుటుంబ సభ్యులు హాస్పిటల్ కి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని ఆయన సోదరుడు రణధీర్ కపూర్ తెలియజేశారు.
కొంత కాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న రిషి కపూర్ అమెరికాలో చాలా కాలం ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఫిబ్రవరి నెలలో ఆయన రెండు సార్లు హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. ఇక నిన్న నటుడు ఇర్ఫాన్ ఖాన్ క్యాన్సర్ కారణంగా మరణించిన సంగతి తెలిసిందే.