అవైటెడ్ ‘కూలీ’ ట్రైలర్ లాంచ్ కి వేదిక ఖరారు.. ఎక్కడంటే

COOLIE Rajinikanth

కోలీవుడ్ తలైవర్ రజినీకాంత్ హీరోగా పాన్ ఇండియా లెవెల్లో అగ్ర తారాగణంతో దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన అవైటెడ్ చిత్రమే “కూలీ”. సాలిడ్ ప్రమోషన్స్ చేసుకుంటున్న ఈ సినిమా ట్రైలర్ కోసం ఇప్పుడు అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక మేకర్స్ ఆల్రెడీ ట్రైలర్ డేట్ ని ఫిక్స్ చేసేసిన సంగతి తెలిసిందే.

రేపు ఆగస్ట్ 2న కూలీ ట్రైలర్ ఫ్యాన్స్ కి ఫీస్ట్ ఇచ్చేందుకు సిద్ధం అవుతుంది. అయితే ఈ ట్రైలర్ కోసం మేకర్స్ గట్టి ప్లానింగ్స్ చేస్తున్నారు. ఓ గ్రాండ్ ఈవెంట్ తో ట్రైలర్ ని విడుదల చేస్తున్నట్టుగా వేదికని ఖరారు చేశారు. రేపు జవహర్ లాల్ నెహ్రు ఇండోర్ స్టేడియం లో ట్రైలర్ ని లాంచ్ చేస్తున్నట్టుగా మేకర్స్ ఇపుడు ప్రకటించారు. ఇక రేపు వచ్చే ట్రైలర్ ఎలా ఉంటుందో మరిన్ని అంచనాలు పెంచుతుందో లేదో అనేది వేచి చూడాలి.

Exit mobile version