విక్టరీ వెంకటేష్ మరియు మెహర్ రమేష్ కాంబినేషన్లో తెరకెక్కబోయే కొత్త చిత్ర ముహూర్తం రేపు రామానాయుడు స్టుడియోలో జరగనుంది. ఈ చిత్రానికి వర్కింగ్ టైటిల్ గా ‘షాడో’ అనుకుంటున్నట్లు సమాచారం. ఈ వేడుకకు మూవీ మొఘల్ డాక్టర్ రామానాయుడు మరియు సురేష్ బాబు ఈ వేడుకకు హాజరు కానున్నారు. మరికొంత మంది సినీ ప్రముఖులు కూడా ఈ వేడుకకు హాజరు కానున్నారు.
ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి నుండి మొదలవుతుంది. ఈ చిత్రంలో వెంకీ మాఫియా డాన్ గా కనిపించబోతున్నారని సమాచారం. వెంకీ సరసన రిచా గంగోపాధ్యాయ హీరొయిన్ గా నటిస్తుంది. కోన వెంకట్ మరియు గోపి మోహన్ స్క్రిప్ట్ అందించగా పరుచూరి ప్రసాద్ నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందించబోతున్నారు.